RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు పేరుతో జరుగుతున్న కార్యక్రమం అసలు ప్రజా సమస్యలపై చర్చించకుండా “దగానాడు”గా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసేలా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని రోజా ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రకటించిన “సూపర్ సిక్స్”, “సూపర్ సెవెన్” హామీలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మోసాల మానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందన్నారు.
జూన్ 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ప్రజలకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నట్లు రోజా తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. “ఈ రెండేళ్లలో మీరు ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉందా?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని, ఇప్పుడు అలాంటి వ్యక్తినే పార్టీ అధ్యక్షుడిగా నియమించారని నారా లోకేష్ పై రోజా విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
మహిళలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన రోజా, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు గతంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. “నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పుడే అమలు చేసి ఉండాలి కదా” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే సరైన తీర్పు ఇస్తారని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..