AP Revenue Meetings: నేటి నుంచి రెవెన్యూ సదస్సులు.. అక్కడికక్కడే భూ సమస్యల పరిష్కారం..!
- భూవివాదాల పరిష్కారం దిశగా సర్కార్ అడుగులు..
- ఏపీలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..
- 17 వేల 564 గ్రామాల్లో నిర్వహణకు ఏర్పాట్లు..
- భూముల వివరాలు తెలపనున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Revenue Meetings: రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. కోర్టులకు వెళ్లకుండా సర్కార్ పరిధిలో పరిష్కరించే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సదస్సులు జరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో భూవివాదాలు పెరిగిపోయాయని.. కబ్జాలు, ఆక్రమణలు జరిగాయని.. ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, ఏపీలో భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన వివాదాలపై ఇందులో చర్చించి.. తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read Also: Chhattisgarh: బీజేపీలో చేరినందుకు.. మాజీ సర్పంచ్‌లను కిడ్నాప్ చేసి చంపిన నక్సల్స్!
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఇవాళ ప్రారంభమై 33 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ సదస్సులు జరగనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భూ వివాదాలు బాగా పెరిగినట్టు కూటమి సర్కార్ గుర్తించింది. అలాగే లెక్కకు మిక్కిలిగా వస్తున్న ఫిర్యాదుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు తీసుకుంటారు. వాటికి స్పాట్లోనే పరిష్కారం చూపనున్నారు. అలాగే, సదస్సుల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డుల్ని ప్రదర్శిస్తారు. అసైన్డ్, ప్రీ హోల్డ్, లీజ్, కేటాయింపు భూముల వివరాలు కూడా ప్రకటిస్తారు. మరోవైపు గతంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతకు కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అంతేకాకుండా అసైన్డ్, ప్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయా అన్నది కూడా రెవెన్యూ సదస్సులు ప్రత్యేకంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 80 శాతం సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తోంది సర్కార్.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..