Pawan Kalyan: శేషాచలం అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం..! వీడియో విడుదల చేసిన పవన్ కల్యాణ్..
- శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం జనసేన బిగ్ ఎక్స్‌పోజ్..
- వీడియోను ట్వీట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- మంగళంపేట అటవీ భూముల్లో భారీ అక్రమ ఆక్రమణలు బహిర్గతం..
- తాను తీసిన ఏరియల్ వ్యూ వీడియోస్ మ్యాపింగ్స్ తో సహా పోస్ట్..
- ఈస్ట్‌ఘాట్స్‌లోని రక్షిత అటవీ ప్రాంతంలో 76.74 ఎకరాల భూకబ్జా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: శేషాచల అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం.. జనసేన పార్టీ బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను స్వయంగా బహిర్గతం చేశారు.. మంగళంపేట అటవీ భూముల్లో అక్రమ ఆక్రమణలపై పవన్ కల్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్స్‌తో సహా బహిర్గతం చేశారు. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాల భూకబ్జా బయటపడింది అన్నారు. ఈ భూములు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నవని పవన్ కల్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరగిందని అని తెలిపారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా తాజా తిరుపతి పర్యటన లో సైట్‌ను సందర్శించి పరిశీలించారు. ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు.
Read Also: YS Jagan: “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది..! చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
ఇక, ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం, కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్‌ల్యాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు. విజిలెన్స్, లీగల్ టీమ్‌లతో విచారణ జరపాలని సూచించారు. అన్ని భూసమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని కూడా ఆదేశించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి.. వాటిని కబ్జా చేసేవారిని విడిచిపెట్టం.. అని పవన్ కల్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు. అటవీ, వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసినవారికి కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
An exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalam Peta forest lands in the eastern ghats, linked to former Forest Minister and senior leader Sri Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) garu. Hon’ble Deputy CM… pic.twitter.com/6OxRhJEhmb
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 13, 2025
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!