Deputy CM Pawan Kalyan: ప్రధాని మోడీ ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ.. అభినందనలు తెలిపిన పవన కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధిపతిగా నిరవధికంగా 8,931 రోజుల సేవ పూర్తి చేసిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణం, భారత ప్రధానిగా కొనసాగుతూ దేశానికి విశేష సేవలు అందించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
పదవిలో గడిపిన కాలం మాత్రమే కాకుండా, అచంచల సంకల్పం, అలసటలేని కృషి, దేశ సేవకు అంకితమైన జీవితం ప్రధాని మోడీని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్.. “గ్రాస్ రూట్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి దేశాన్ని నడిపిస్తూ ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంతో పాలనకు కొత్త నిర్వచనం ఇచ్చారు” అని పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, త్యాగం, అపార కృషితో కొనసాగుతున్న నాయకత్వం దేశ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. మౌలిక వసతులు, పేదల సాధికారత, డిజిటల్ మార్పులు వంటి రంగాల్లో ప్రధాని మోడీ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచడంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర కీలకమని పేర్కొన్నారు పవన్ కల్యాణ్… ఈ మైలురాయి నిజమైన నాయకత్వం స్థిరత్వం, నిబద్ధత, స్వార్థరహిత సేవపై ఆధారపడుతుందని గుర్తుచేస్తుందని అన్నారు. ఇక, ప్రధాని మోడీకి మరింత ఆరోగ్యం, శక్తి కలగాలని, దేశసేవలో ఇంకా ఎన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ (ట్వీట్) పెట్టారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..
Heartiest congratulations to Hon’ble Prime Minister Shri @narendramodi Ji on the extraordinary milestone of 8,931 days in continuous service as the head of government, spanning his tenure as Chief Minister of Gujarat and now as Prime Minister of India.
His journey is not merely… pic.twitter.com/QHlkdhdpCt
— Pawan Kalyan (@PawanKalyan) March 23, 2026
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!