సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ వేదికగా ఎమ్మెల్యేలకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేను కామన్ మ్యాన్ గా ఉన్నాను.. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలని స్పష్టం చేశారు.. మనం ప్రజలకు సేవకులం.. పాలకులం కాదన్న ఆయన.. దర్జాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని సూచించారు..
ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు తేవాలన్నా శాసనసభ్యులే కీలకం. నియోజకవర్గాల్లో వాళ్ళు, వాళ్ల అనుచరుల వ్యవహారాలు, ప్రవర్తనను బట్టే ప్రభుత్వం మీద ప్రజలకు ఓ అభిప్రాయం కలుగుతుంది. కానీ... ప్రస్తుతం ఏపీలోని చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారన్న నివేదికలు అందుతున్నాయట ప్రభుత్వ పెద్దలకు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు..
ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు అని స్పష్టం చేశారు చంద్రబాబు.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుందన్నారు.. మూడు పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని జయప్రదం చేసేలా సహకరించాలని కోరారు..