ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు అని స్పష్టం చేశారు చంద్రబాబు.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుందన్నారు.. మూడు పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని జయప్రదం చేసేలా సహకరించాలని కోరారు..
లోకల్ గా ఇసుక కొరత ఉండొద్దన.. గ్రామాల్లో నిర్మాణాలు ఆగిపోవద్దని.. స్థానిక అవసరాలకు ఉచిత అనుమతి ఇస్తూ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి…