MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
MLC Jayamangala Venkataramana: ఏపీలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జయమంగళ వెంకటరమణ 2024 నవంబర్ 23న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే, తన రాజీనామా ఆమోదం విషయంలో స్పష్టత రాకపోవడంతో అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2025 సెప్టెంబర్ 16న ఈ అంశంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
Read Also: Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Also Read
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
ఈ కేసులో మండలి చైర్మన్ తరఫు న్యాయవాదులు కోర్టులో కీలక వాదనలు వినిపించారు. జయమంగళ వెంకటరమణ స్వచ్ఛందంగా కాకుండా, ఎవరో ప్రేరేపించడంతో రాజీనామా చేశారనే అనుమానాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కారణంగానే రాజీనామాను తిరస్కరించినట్లు వెల్లడించారు. మరోవైపు, మండలిలో ప్రతిపక్ష నేత కూడా వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల వెనుక ఏదో కారణం ఉందని చైర్మన్‌కు లేఖ రాసినట్లు సమాచారం. కొందరి ప్రేరణతోనే రాజీనామాలు జరిగి ఉండొచ్చని పేర్కొంటూ, వాటిపై మరోసారి సమీక్ష చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మండలి చైర్మన్, జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదించకుండా తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇకపై ఈ అంశం న్యాయపరంగా, రాజకీయంగా మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!