Cyclone Montha: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొంథా తుఫాన్ తీవ్రతపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి నారా లోకేష్.. వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి క్షేతస్థాయి పరిస్థితులను వాకబు చేశారు.. ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో ఫోన్లో ఆరా తీశారు..
Read Also: ‘Baahubali: The Epic’ : అనుష్కను ఒప్పించే పనిలో పడిన రాజమౌళి..!
మొంథా తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఈ రోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు మంత్రి నారా లోకేష్.. అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని శాసనసభ్యులకు సూచించారు.. సంక్షోభ సమయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి.. బాధితులకు అవసరమైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. అయితే, డ్రెయిన్లు పొంగి ప్రవహించకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. అలెర్ట్స్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ప్రతి రెండు గంటలకోసారి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్..
Read Also: Bollywood : సత్తా చూపించని టాలీవుడ్.. అదరగొట్టిన శాండిల్ వుడ్
మరోవైపు, మొంథా తుఫాను తీవ్రతపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.. మొంథా తీవ్ర తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వివరించిన అధికారులు.. ఏ ప్రాంతంలో మొంథా తుఫాను తీరం దాటుతుందో అధికారులను ఆరా తీశారు.. నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. తుఫాన్ ప్రభావంతో వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై అధికారులను ఆరా తీశారు.. మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలో ఉద్యానపంటలు దెబ్బతినే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ కు వివరించిన అధికారులు..