‘Baahubali: The Epic’ : అనుష్కను ఒప్పించే పనిలో పడిన రాజమౌళి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బాహుబలి: ది ఎపిక్’ మెగా రీ–రిలీజ్‌కి సంబంధించి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మహా చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం చుట్టూ మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ “ఈ ఇతిహాసాన్ని మళ్లీ పెద్ద తెరపై చూడండి” అంటూ అభిమానులను థియేటర్లకు ఆహ్వానించాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టి అనుష్క వైపే. ఎందుకంటే, ఆమె ఈ ప్రమోషన్లలో పాల్గొనబోతుందా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read :Sonal Chauhan : ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’లో సోనాల్ ఎంట్రీ..!
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజాగా విడుదలైన ఆమె సినిమా ‘ఘాటి’ ప్రమోషన్లకు అనుష్క హాజరుకాలేదు. కేవలం ఆడియో ఇంటర్వ్యూల ద్వారానే ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడింది. తన ఫిగర్ పై దృష్టి పడకూడదనే ఉద్దేశంతో ఆమె కెమెరా ముందు రావడాన్ని మానేసిందని టాక్. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. బాహుబలి ఫ్రాంచైజీ అనేది భారత సినిమా చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన ప్రాజెక్ట్. అలాంటి చిత్ర రీ–రిలీజ్‌కి అనుష్క హాజరవ్వక తప్పదు అని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఆమె ఒప్పుకోవాలంటే రాజమౌళి తన మాజిక్ వర్క్ చేయాల్సిందే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటి వరకైతే ఎవరినైనా సులభంగా ఒప్పించగల వ్యక్తి అంటే రాజమౌళి, ఇక అనుష్కను కూడా ప్రమోషన్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. మరి ‘బాహుబలి: ది ఎపిక్’ ద్వారా అనుష్క మళ్లీ అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని పునరుద్ధరించుకోగలదా? అనేది చూడాలి. ఏదేమైనా, రాజమౌళి – అనుష్క జోడీ మళ్లీ ఒకే వేదికపై కనిపిస్తే, బాహుబలి రీ-రిలీజ్ ప్రమోషన్లకు అదో బ్లాక్‌బస్టర్ బూస్ట్ అవుతుందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..