WhatsApp Governance: అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!
- ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం..
- "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి ఈ తరహా సేవలు..
- వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది.. ఏపీ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చింది.. ప్రజలకు మొదటి దశలో 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.. రెవెన్యూ, దేవాదాయ శాఖ, సీఎంఆర్ఎఫ్.. ఇలా మొత్తంగా “మన మిత్ర” ద్వారా 161 రకాల సేవలను పౌరులకు అందుబాటులో ఉంటాయని.. వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.. రెండో దశలో 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఇక ఏపీ ప్రభుత్వం దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించనుంది.. ఒకేముందు.. 95523 00009ను సేవ్ చేసుకోండి.. మీకు కావాల్సిన సేవను అందుకోండి..
Read Also: Jio Recharge Offer: త్వరపడండి.. 200 రోజులకు 500GB డేటా
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఇక, వాట్సాప్ సేవలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పరిపాలన సంస్కరణల్లో ఇది ఒక చారిత్రాత్మక రోజు. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నాం. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్‌తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. యువగళం పాదయాత్రలో నే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చిందన్నారు.. బటన్ నొక్కితే భోజనం, సినిమా వచ్చినపుడు.. పాలన ఎందుకు రాకూడదు..? ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనేది మా ఉద్దేశం అన్నారు.. ఊరు నుంచి ఇంకో ఊరు పాదయాత్రలో వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ ల కోసం మమ్మల్ని తిప్పద్దు అని చాలా మంది అడిగారు.. గత ఐదేళ్లలో సర్టిఫికెట్ కుడి కొన్ని సందర్భాల్లో రాలేదు. దుగ్గిరాల మండలం లో ఎంపీటీసీ పోటీ చేస్తే గత ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. సర్టిఫికెట్ కోసం ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అనేది మా ఉద్దేశమని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!