తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్‌తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు.
ఏపీ ప్రభుత్వం దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించనుంది.. ఒకేముందు.. 95523 00009ను సేవ్ చేసుకోండి.. మీకు కావాల్సిన సేవను అందుకోండి..
వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి…