Liquor Sales: మందుబాబులకు ఏపీ సర్కార్ శుభవార్త.. అర్ధరాత్రి వరకు లిక్కర్ అమ్మకాలు
- మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..
- అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి..
- డిసెంబర్ 31వ తేదీతో పాటు.. జనవర్ 1వ తేదీన కూడా అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 2024కు గుడ్‌బై చెప్పి.. 2025కి స్వాగతం పలికేందుకు అంతా స్వాగతం సిద్ధం అవుతోన్న తరుణంలో.. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి.. అయితే, మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వరకు లిక్కర్ సేల్స్‌కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్ శాఖ పెంచింది. మద్యం షాపులు, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతిచ్చింది. సాధారణంగా ప్రతీరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో.. మద్యం షాపులు, బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని భావించిన ప్రభుత్వం.. అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది.. డిసెంబర్ 31వ తేదీతో పాటు.. జనవర్ 1వ తేదీన కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది సర్కార్.. అయితే, ఇప్పటికే బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిగితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం విదితమే..
Also Read
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ సేల్స్ భారీగా పెరిగినట్టు ఎక్సైజ్ శాఖ చెబుతోంది.. ప్రైవేట్ లిక్కర్ షాపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత అంటే.. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.. ఈ 75 రోజుల కాలంలో 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు సాగగా.. 83,74,116 కేసుల మద్యం అమ్మినట్టు చెబుతున్నారు. బార్లు, వైన్ షాపులకు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.. ఇక, డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి ఈ రోజుకి ఆరోజు సరుకు పంపుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!