Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: వినాయక చవితి రోజు ప్రతిష్టించిన బొజ్జ గణపయ్య విగ్రహాలను సంబరాలతో సాగనంపుతున్నారు భక్తులు.. అయితే, డీజే వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం.. వాహనాన్ని సీజ్ చేసిన ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీకి విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్.. నిమజ్జనానికి డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ తనకు పలువురు సందేశాలు పంపుతున్నారని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకుని డీజే వాహనాలకు అవసరమైన అనుమతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు. నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి, వేగంగా క్లియరెన్స్‌లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక్క డీజే వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేయకూడదని లోకేష్ పోలీసు శాఖను కోరారు. ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకునేలా అధికారులు సహకరించాలని ఆయన తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. లోకేష్ తన ఎక్స్ పోస్టులో హోంమంత్రి అనిత, డీజీపీని ట్యాగ్ చేస్తూ ఈ విజ్ఞప్తి చేశారు. దీనిపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. డీజే అనుమతుల దరఖాస్తులను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలించి అనుమతులు ఇచ్చేలా పోలీసు శాఖకు అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
I am getting messages saying the police are not issuing permissions for DJ vehicles during Ganesh Nimmajanam. I request Home Minister @Anitha_TDP Garu and the DGP Garu to ensure permissions are given without hassle. Not a single DJ vehicle should be seized.@APPOLICE100
— Lokesh Nara (@naralokesh) September 17, 2026
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!