Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Picnic: కంటెంట్ బాగుంటే భాషల హద్దులు దాటి ఎలాంటి విజయాలు సాధిస్తాయో ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాలు చూపించాయి. ఈ రెండు మలయాళం సినిమాలను నిర్మించిన భావనా స్టూడియోస్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ‘పిక్నిక్’ సినిమాను ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు.. ‘ప్రేమలు’, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సినిమాలకు సహ రచయితగా పనిచేసిన కిరణ్ జోసే ‘పిక్నిక్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ ప్రదీప్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీతగా దిలీష్ పోతన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సుజినా శ్రీధరన్, అక్షత అజిత్ కూడా తారాగణంలో భాగమయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ‘పిక్నిక్’ను తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. పచ్చని కొండలు, రంగురంగుల పూల పొలాల మధ్య పోస్టర్‌ను చాలా ఆహ్లాదకరంగా డిజైన్ చేశారు. పోస్టర్ చూస్తేనే సినిమా మొత్తం కుటుంబంతో కలిసి చూసే సరదా ఎంటర్టైనర్గా ఉండబోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. ‘96’, ‘సత్యం సుందరం’ వంటి సినిమాలకు సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. మలయాళం ప్రేక్షకులకే పరిమితం కాకుండా దక్షిణాది మార్కెట్లో మరింత విస్తరించాలనే ఉద్దేశంతో భావనా స్టూడియోస్ ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయనుంది. ‘పిక్నిక్’ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి మరో మలయాళ సినిమా కూడా చేరబోతోంది.
Also Read
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
తెలుగు వెర్షన్ విషయంలోనూ మేకర్స్ ముందుగానే ప్లాన్ చేశారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ షోయింగ్ బిజినెస్ తెలుగు థియేట్రికల్ రిలీజ్ కోసం ‘పిక్నిక్’తో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో ‘ప్రేమలు’ను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈ సంస్థకు ఆ సినిమా భారీ విజయాన్ని అందించింది. దీంతో ‘పిక్నిక్’పై కూడా తెలుగు మార్కెట్లో బజ్ పెరుగుతోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, పాటలు, ఇతర ప్రమోషనల్ అప్డేట్స్ త్వరలో వెలువడనున్నాయి.
- Tags
- cinema
- Picnic Movie
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!