Kidney Cancer Signs: ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది. కిడ్నీలో ఉండే అనారోగ్యకరమైన కణాలు అనియంత్రితంగా పెరగడం, కణితి రూపంలో ఉన్నప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. కానీ ప్రజలలో పెరుగుతున్న వయస్సుతో ప్రమాదం పెరుగుతుంది. స్త్రీల కంటే పురుషులకు కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం రెండింతలు. ప్రారంభ దశలలో మూత్రపిండ క్యాన్సర్ లక్షణాలు కనపడవు. కాబట్టి అంత సులువుగా కనిపెట్టలేము.
Also Read: Yogi Adityanath: ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే.. ఆలంగీర్ ఆలం కూడా అంటూ సీఎం యోగి ఫైర్
ఇకపోతే, మూత్రపిండాల క్యాన్సర్ ప్రారంభ లక్షణాల విషయానికి వస్తే.. మూత్రపిండ క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణం మూత్రంలో రక్తం రావడం. మూత్రంలో పింక్, ఎరుపు లేదా గోధుమ రక్తం కనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన కిడ్నీ క్యాన్సర్ సంకేతం. అలాగే కడుపు లేదా వెన్ను, ఇంకా వెనుక భాగంలో నొప్పి ఎక్కువుగా ఉంటే మూత్రపిండ క్యాన్సర్ లక్షణం. ఈ నొప్పి నిరంతరంగా లేదా అడపాదడపాగా ఉండవచ్చు. కిడ్నీ క్యాన్సర్ శరీరంలో అలసట, బలహీనతను కలిగిస్తుంది. మీరు వ్యాయామం లేకుండా బరువు కోల్పోతే అది కూడా కిడ్నీ క్యాన్సర్ సంకేతం కావచ్చు.
కిడ్నీ క్యాన్సర్ యొక్క ఇతర లక్షణాల విషయానికి వస్తే.. అధిక రక్తపోటు, ఆకలి నష్టం, వికారం, వాంతులు, జ్వరం, రక్తహీనత ఉంటాయి. ధూమపానం చేసేవారిలో కిడ్నీ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు మూత్రపిండాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీ కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ క్యాన్సర్ ఉంటే, మీ రిస్క్ కూడా పెరుగుతుంది. పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి వంటి కొన్ని రకాల కిడ్నీ వ్యాధి కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాడ్మియం, ట్రైక్లోరెథిలిన్ వంటి కొన్ని రసాయనాలు కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
Also Read: Green Tea Effects: ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే?
అయితే, కిడ్నీ క్యాన్సర్‌ను నివారించే మార్గాలు చూస్తే.. కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం, సకాలంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అలంటి సమస్య ఏర్పడితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.