Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడలో నిరసనకారులపై దాడులు జరిగాయని, దీక్షా శిబిరంపై నేరుగా దాడి చేశారని, మహిళలపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. మల్లాది విష్ణుపై దాడి జరిగినప్పటికీ బాధితుడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం తప్పా అని పేర్ని నాని నిలదీశారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అండతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, బోండా ఉమా చర్యలకు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉందని వ్యాఖ్యానించారు. ముద్రగడ పద్మనాభం విగ్రహం తయారు చేయించి ఎందుకు ఏర్పాటు చేయలేదని, వంగవీటి రంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని ప్రశ్నించారు. దాడులు చేసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని ఆపబోదని స్పష్టం చేశారు.
పోలీసులను ప్రభుత్వం ప్రైవేట్ సైన్యంలా ఉపయోగిస్తోందని పేర్ని నాని ఆరోపించారు. డీజీపీకి అనేకసార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతోందన్నారు. జగన్ పర్యటనల సందర్భంగా భద్రతా లోపాలు పునరావృతమవుతున్నాయని, వాటిపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే పర్యటిస్తున్నారని, ఆయన భద్రతను పోలీసులు సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో అవినీతి, శాంతిభద్రతల పరిస్థితిపై కూడా పేర్ని నాని ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రతిపక్షాల గొంతును అణచివేయాలనే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
తాజావార్తలు
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!