2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.. రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు..
ఏపీ ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.. గత ప్రభుత్వంలో జరిగిన పనులకు.. ఇప్పుడు బిల్లుల చెల్లింపులు చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.. 2014-19 నాటి బిల్లులు పెండింగులో ఉండగానే.. గత ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..