Deputy CM Pawan Kalyan: ఫలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి.. నేడు రాష్ట్రానికి కుంకీ ఏనుగులు
- ఫలించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి..
- నేడు ఏపీకి కుంకీ ఏనుగులను అప్పగించనున్న కర్ణాటక ప్రభుత్వం..
- నేడు బెంగళూరుకు పవన్ కల్యాణ్..
- కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో అధికారికంగా అప్పగింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి ఫలించబోతోంది.. రాష్ట్రంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు, ఊళ్లపై పడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ.. ఎంతో మంది రైతుల, ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు పవన్ కల్యాణ్.. అడవి ఏనుగులను కట్టడి చేయడానికి కుంకీ ఏనుగుల కోసం చర్చించి ఒప్పించారు.. ఇక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఆరు కుంకీ ఏనుగులను అందించబోతోంది కర్ణాటక ప్రభుత్వం.. అందులో భాగంగా నేడు బెంగళూరు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్.. కుంకీ ఏనుగులను ఏపీకి రప్పించే కార్యక్రమానికి హాజరుకానున్నారు.. అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది… శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను అధికారికంగా ఈ రోజు ఏపీకి అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం.
Read Also: Spy Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. వెలుగులోకి కీలక విషయాలు
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
బెంగళూరులో నేడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించనున్నట్టు ఇప్పటికే కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు.. తమకు కుంకీ ఏనుగులు కావాలని గతేడాది ఆగస్టు 8వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఇక, సెప్టెంబరు 27న విజయవాడకు నేను వెళ్లిన సమయంలో ఏనుగుల అప్పగింతకు ఒప్పందం కుదిరినట్టు వెల్లడించారు.. అందుకు అనుగుణంగా కుంకీ ఏనుగులను ఏపీకి అందించబోతున్నాం. ఏపీ నుంచి కర్ణాటకలోకి ఏనుగులు రాకుండా అక్కడి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి ఈశ్వర్ ఖండ్రే..
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!