CPM Raghavulu: డీలిమిటేషన్‌పై అమిత్ షా వ్యాఖ్యలు మోసపూరితం
- డీలిమిటేషన్‌పై అమిత్ షా వ్యాఖ్యలు మోసపూరితం
- బీజేపీ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..?
- సీపీఎం రాఘవులు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీలిమిటేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీపీఎం రాఘవులు తప్పుపట్టారు. అమిత్ షా చాలా మోసపూరితంగా మాట్లాడారన్నారు. బీజేపీ అనుకున్న రాష్ట్రాలకు మాత్రమే ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..? అని నిలదీశారు. పార్లమెంటు సీట్లు పెంచాలంటే అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. డీలిమిటేషన్ మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అమిత్ షాకి వంతపాడతారా..? ఎదురుతిరుగుతారో చెప్పాలని రాఘవులు డిమాండ్ చేశారు.
కోతల బడ్జెట్..
ఏపీ బడ్జెట్ కోతల బడ్జెట్ తప్ప నిజాయితీ కలిగిన బడ్జెట్ కాదు అని రాఘవులు ధ్వజమెత్తారు. ‘‘బడ్జెట్లో చూపిస్తున్న అంకెలు సంవత్సరంలో కోతబడతాయి. పన్నేతర ఆదాయం రూ. 12 వేలు పెరుగుతుందని.. అది ఎలా తెస్తారో చెప్పలేదన్నారు. మభ్యపెట్టడానికి చేసినదే ఏపీ బడ్జెట్. బడ్జెట్ ప్రారంభంలోనే మూడు సిక్స్‌లు లేకుండా పోయాయి. మిగిలిన మూడు సిక్స్ల్లో లబ్ధిదారుల కోత పెడతారని అర్థమవుతుంది. ప్రకటించిన డీఎస్సీని వర్గీకరణ అనంతరమే ప్రకటిస్తాంమంటూ వాయిదా వేసే పరిస్ధితి కనిపిస్తోంది. బడ్జెట్ చూస్తే సంవత్సరం పాటు ఆకలి లేకుండా పోయేలా ఉంది. వెలిగొండ తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది చేయడం లేదు. సంతృప్తి పరచడానికి మాత్రమే బడ్జెట్ కేటాయింపులు.’’ ఉన్నాయని రఘవులు ఆరోపించారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunnam: నేటి నుండి ఓటీటీలో సందడి చేయనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్చేస్తే ఏపీ, తెలంగాణలో 3 చొప్పునే సీట్లు పెరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లుండగా 20 వరకు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 ఉండగా 28కి పెరుగుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా రెండు పెరిగి 41కి చేరుకుంటాయి. యూపీ, బిహార్‌లో మాత్రం భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 128కి పెరిగే అవకాశం. బీహార్‌లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్‌లో 25 నుంచి 44కి లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్నాటకలో 28 స్థానాలుండగా.. 36కి పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేసిందోచ్.. మరి ఎలా ఉందంటే!
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!