CM Chandrababu: యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆర్జీజీఎస్ నుంచి ఆయా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఈ సమావేశానికి సీఎస్ కే.విజయానంద్, వ్యవసాయశాఖ, వైద్యారోగ్యం, ఐటీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని సీఎంకు తెలిపారు అధికారులు.. మరో 10 రోజుల్లో 23,592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందన్నారు.. అయితే నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.. ఎరువుల కేటాయింపు అంశంపై సమీక్షలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడిన సీఎం.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 రేక్ ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించారు కేంద్రమంత్రి నడ్డా..
Read Also: Vice President Election 2025: ఎన్డీఏ vs ఇండియా రె’ఢీ’.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరి బలమెంత?
మరోవైపు, వచ్చే రబీ సీజన్ కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని సూచించారు.. ఎరువులు దొరకవనే ఆందోళనతో ఒకేసారి కొనుగోలు చేయకుండా, నిల్వ చేసి పెట్టుకోకుండా చూడాలన్నారు.. ఇక కర్నూలు మార్కెట్ లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైనా సమీక్షించారు సీఎం.. ఉల్లి ధర క్వింటాలుకు రూ.1200 తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు.. రైతులు ఎవరైనా క్వింటాకు రూ.1200 కంటే తక్కువ ధరకు అమ్ముకుంటే… ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగు మందు డబ్బాతో ఆత్మహత్య డ్రామా ఆడిన వారిపై విచారణ చేస్తున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. పంటను కనీసం మార్కెట్ కు తేకుండా పురుగుమందు తాగినట్లు డ్రామా ఆడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు..
Read Also: Undavalli Arun Kumar: ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. ఇదే రైట్ టైం..!
అరకు కాఫీకి సోకిన కాయతొలుచు తెగులుపైనా సమీక్షించారు సీఎం చంద్రబాబు.. కాఫీ తోటలకు సోకిన తెగులును ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఇప్పటి వరకు 80 ఎకరాలకు మాత్రమే తెగులు సోకిందని… అందులో 60 ఎకరాలు తొలగించామని సీఎంకు వివరించారు అధికారులు.. అయితే, తురకపాలెం గ్రామ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.. పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఆర్టీసీ సహా వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవల్లో సంతృప్తి స్థాయిపైనా సీఎం సమీక్షించారు.. పౌరసేవల సంతృప్త స్థాయిపై ఇక నుంచి ప్రతీ వారం సమీక్షిస్తానని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాలను డేటా అనలటిక్స్ ద్వారా విశ్లేషిస్తామన్నారు.. కీపెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేందుకు ఏమేరకు ఉపకరిస్తాయో చూడాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..