CM Chandrababu: ఓటుకు నోటు వద్దు.. మంచి నాయకుడిని ఎన్నుకోండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎన్నికల్లో ధన ప్రవాహంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు డబ్బులకు ఆశపడి ఓటు హక్కును అమ్ముకోవద్దని సూచించారు. రూ.500, రూ.వెయ్యి కోసం ఓటు అమ్ముకోవాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గితేనే ప్రజాసేవకు ప్రాధాన్యం పెరుగుతుందని అన్నారు. నాయకత్వం బాధ్యతగా ఉంటే సమాజం కూడా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు.
పేదలకు ఇబ్బంది కలగకూడదనే ముందస్తుగా పెన్షన్లు
ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశామని చంద్రబాబు తెలిపారు. నవంబర్ 1న ఎన్నికలు ఉంటే అక్టోబర్ 31న సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటారని భావించి అక్టోబర్ 30నే పెన్షన్లు పంపిణీ చేశామని వివరించారు. పేదలు ఒక్కరోజు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందస్తుగా సంక్షేమ పథకాల నిధులు జమ చేశామని చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పేదలకు ఆర్థిక సాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇంత బాధ్యతగా వ్యవహరిస్తున్నప్పుడు ఓటర్లు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా ఓటు వేసినవారు, అవినీతి సొమ్ము వద్దంటూ డబ్బులను తిరస్కరించిన ఓటర్లు కూడా ఉన్నారని గుర్తుచేశారు. అలాంటి బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. రాజకీయాల్లో మార్పు వచ్చినప్పుడే సమాజంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Also Read
- CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
- Andhra Pradesh Rice Prices: బియ్యం ధరలకు కళ్లెం.. కిలో రూ.47 నుంచి రూ.82! ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
- APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
- Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు మూడేళ్ల ప్రణాళిక
ఇక, రాయలసీమ అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాయలసీమ దశ, దిశ మార్చేలా మూడేళ్ల ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన సమస్యలు కరువు, తుఫాన్లేనని పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 53.5 శాతం వర్షపాతం లోటు నమోదైందని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మూడేళ్ల కాలపరిమితితో ఉద్యానవన రంగ అభివృద్ధి ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఉద్యాన పంటల సాగు, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటూ రాయలసీమ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. తుపానుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
తుఫాన్లను సమర్థంగా ఎదుర్కొన్నాం..
వరుస తుఫాన్లను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాన్ వచ్చిన ప్రతిసారీ ముందస్తు అంచనా నుంచి సహాయక చర్యల అమలు వరకు నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం ఇతర రాష్ట్రాల నుంచి సిబ్బందిని, అవసరమైన సామగ్రిని రప్పించామని చెప్పారు. తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తుఫాన్ల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో తుపానుల కారణంగా ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను మరింత తగ్గించాలని అధికారులకు సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: ఓటుకు నోటు వద్దు.. మంచి నాయకుడిని ఎన్నుకోండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు
-
Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్‌కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
ట్రెండింగ్
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!