CM Chandrababu: P4 కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీ4 కార్యక్రమంపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ విజయానంద్, పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా.. మార్గదర్శకుల ఎంపికపై జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.. P4 రివ్యూ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం..
Read Also: PVN Madhav: రాజధాని అమరావతిపై బీజేపీ ఏపీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే అన్నారు సీఎం చంద్రబాబు.. బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతోందన్న ఆయన.. ఎక్కడా ఎవరిపైనా బలవంతం లేదు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని స్పష్టం చేశారు.. ఎవరినీ బలవంతం చేయొద్దు.. మానవత్వం ఉండే వారే ఇందులో చేరతారు.. మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల తరహాలో వ్యవహరిస్తార.. ప్రజల మనస్సుల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తారని మండిపడ్డారు..
Read Also: Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు.. భయబ్రాంతులకు గురైన జనం..!
ఇక, గతంలో జన్మభూమి, శ్రమదానం, నీరు-మీరు ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే విధంగా విమర్శించారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు.. నేను ఇలాంటివి పట్టించుకోను.. కొందరికి ఆర్ధిక వనరులు ఉన్నా పేదల్ని ఆదుకోవడానికి మనస్సు రాదు.. కొందరికి మనస్సు ఉన్నా సమయం ఉండకపోవచ్చు.. ఇలాంటి వారిని గుర్తించండి.. పీ4 వేదిక ఉందని చెప్పండి అని సూచించారు.. ఆర్ధిక అసమానతలు మరింతగా తగ్గాలి.. ఇవి పెరిగితే సమాజానికి మంచిది కాదన్నారు.. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే.. రేపు మార్గదర్శి కావచ్చు.. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం పీ4 ద్వారా అందుతుందన్నారు.. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలను కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..