Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు.. భయబ్రాంతులకు గురైన జనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gachibowli: హైదరాబాద్‌లో నిన్న కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు గచ్చిబౌలిలో పిడుగు పడింది. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడింది. భారీ శబ్దం రావడంతో జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. పిడుగు ధాటికి తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
కాగా.. వారం రోజుల గ్యాప్ తర్వాత.. మళ్లీ వరుణుడు హైదరాబాద్‌ను ముంచేశాడు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్.ఆర్.నగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలల్లోనూ వర్షం కుమ్మేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాల్లో రోడ్లపై నీళ్లు పోటెత్తాయి. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు సైతం జారీ చేసింది. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరించింది.
READ MORE: Mohammed Siraj: హైదరాబాద్‌లోనే కాదు, ఎక్కడున్నా సిరాజ్కి బిర్యానీ!
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!