ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దౌర్జన్య ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలిలని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, అధికారం మారిన తర్వాత పరిస్థితి గురించి ఆలోచించాలి.. అధికారం పోయిన తర్వాత, చేసిన వాటిని అనుభవించాల్సి వస్తుంది.. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలి, లేకపోతే ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు కాటసాని రాంభూపాల్…
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం.. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. అయితే, తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు..