CRDA Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా ఈ రోజు రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా.. మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై ఐఐటీ ఇంజినీర్లతో అధ్యయనం చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు కీలకమైన సీఆర్డీఏ సమావేశానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు.. ఈ రోజు సాయంత్రం సీఆర్డీఏ అధికారులతో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకునే ఛావ్స్ కన్పిస్తోంది. గతంలో రాజధానిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాట్ల కోసం స్థలాలు ఇచ్చారు. సుమారు 130కు పైగా సంస్థలకు భూములిచ్చారు. వీటిల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి.
Read Also: Raj Tarun Lavanya Case: హైడ్రామాలో కొత్త ట్విస్ట్… లావణ్యపై రాజ్ తరుణ్ తల్లితండ్రులు కంప్లైంట్..
అయితే, ఆయా సంస్థలు రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు కాల పరిమితి ఉంది. గత ఐదేళ్లు ప్రభుత్వం రాజధాని విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉండడంతో సదురు సంస్థలు రాజధానిలో కార్యాలయాల ఏర్పాట్లు పనులే ప్రారంభించ లేదు. ఇలాంటి కంపెనీలు.. సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరిపారు. కొందరు తమ ఆఫీసులను ప్రారంభించేందుకు సంసిద్ధతను కూడా తెలిపాయి. ఈ క్రమంలో ఆయా సంస్ధలకు కాలపరిమితి పొడిగించాల్సి ఉంటుంది. అథార్టీ సమావేశంలో కాలపరిమితి పెంచే అంశంపై కాలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. అలాగే రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులకు కౌలు చెల్లింపు విషయంలో కూడా చర్చ జరగనుంది. పదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందనే అంచనాతో నాడు టీడీపీ ప్రభుత్వం పదేళ్ల పాటు కౌలు ఇచ్చేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, గత ఐదేళ్లల్లో రాజధాని నిర్మాణం ఎక్కడిది అక్కడే ఆగిపోయింది. దీంతో మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లింపులు జరపాలనే డిమాండ్ ఉంది. దీనిపై అథార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతోన్న తొలి సమావేశం కావడంతో రాజధాని నిర్మాణ పనులు.. మౌళిక వసతులు, రిటర్నబుల్ ప్లాట్లు.. మాస్టర్ ప్లాన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్, నిధుల సమీకరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.