CM Chandrababu: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు.. కానీ, ఆయన భావజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు.. మన్మోహన్ లేని లోటు ఎవరూ పూడ్చలేరన్న ఆయన.. ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, యూజీసీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించారు.. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారని గుర్తుచేశారు..
Read Also: Manmohan Singh: మన్మోహన్ సింగ్ పాలనలో ‘‘బెస్ట్ మూమెంట్’’, ‘‘అతిపెద్ద నిరాశ’’..
ఇక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దశ దిశను రూపొందించారు మన్మోహన్ అని కొనియాడారు చంద్రబాబు నాయుడు.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్టీఐ చట్టం, నరేగా, ఆధార్ లాంటి ఎన్నో పాలసీలు తీసుకొచ్చారు.. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఉన్నతమైన పదవుల్లో పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్.. ఆయన మంచి రాజకీయ నాయకుడన్న చంద్రబాబు.. మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు.. ఆయన లేకపోవడం దేశానికి తీరని లోటు.. బాధాకరం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..