NTV Telugu Site icon

AP Assembly: ఆ ఒక్క మాటతో అసెంబ్లీలో నిల్చున్న 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలు నవ్వులు..

Babu

Babu

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు.. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాలపై కేసులు పెట్టారని ఫైర్‌ అయ్యారు.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి.. ప్రజల వాయిస్‌ వినిపించకుండా చేసేందుకు.. ప్రజాప్రతినిధులు, నేతలపై కేసులు పెట్టారని విమర్శించారు.. ఇక, వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు..

Read Also: Olympics 2024: ఆరు పదుల వయసులో ఒలింపిక్స్ లోకి అడుగు పెడుతున్న బామ్మ..

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు.. మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు.. ఇలా 80 శాతం మంది ఎమ్మెల్యేలు సభలో ఒక్కసారిగా లేచి నిలబడ్డారు.. నాపై రెండు కేసులు.. నాపై మూడు కేసులు.. నాపై అయితే ఏడు కేసులు అంటూ.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. అంటుంటూ సభలో నవ్వులు పూసాయి.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సహా సభ్యులంతా నవ్వుకున్నారు. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో కేసులు ఉన్న నేతల్లో దాదాపు అసెంబ్లీకి వచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.