AP Assembly: ఆ ఒక్క మాటతో అసెంబ్లీలో నిల్చున్న 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో నవ్వులు..
- అసెంబ్లీ సమావేశాల్లో నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..
- అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల సీఎం..
- వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని కోరిన ఏపీ సీఎం..
- సభలో లేచి నిల్చున్న దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు.. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాలపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి.. ప్రజల వాయిస్ వినిపించకుండా చేసేందుకు.. ప్రజాప్రతినిధులు, నేతలపై కేసులు పెట్టారని విమర్శించారు.. ఇక, వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు..
Read Also: Olympics 2024: ఆరు పదుల వయసులో ఒలింపిక్స్ లోకి అడుగు పెడుతున్న బామ్మ..
Also Read
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు.. మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు.. ఇలా 80 శాతం మంది ఎమ్మెల్యేలు సభలో ఒక్కసారిగా లేచి నిలబడ్డారు.. నాపై రెండు కేసులు.. నాపై మూడు కేసులు.. నాపై అయితే ఏడు కేసులు అంటూ.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. అంటుంటూ సభలో నవ్వులు పూసాయి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా సభ్యులంతా నవ్వుకున్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేసులు ఉన్న నేతల్లో దాదాపు అసెంబ్లీకి వచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!