ఏపీ రెరాలో రిజిస్టర్ కాని ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు ఆంధ్ర ప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఛైర్‌పర్సన్ సురేష్ కుమార్..
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఆథారిటీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ డ్రైవ్ నిర్వహించారు.. ప్రతి దరఖాస్తుకు సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అధికారులను వివరణ అడిగారు మంత్రి.. భవనాలు, ప్లాట్లు కొనుగోలుచేసేవారు ప్రకటనలు చూసి మోసపోకుండా ఉండేలా చూడటమే రెరా లక్ష్యం అన్నారు..
హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కేవలం బ్లాక్ మెయిల్ దందా చేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధానాల వల్ల భూములు అమ్మడంలో జాప్యం అవుతూ రియల్టర్లు, బిల్డర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు.
`రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా నిబంధనలు అతిక్రమించిన పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల లోగా సంజయిషి సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు రెరా అధికారులు. బిల్డాక్సు రియల్ ఎస్టేట్ కంపెనీ హఫీజ్ పేటలో ప్రీ-లాంచ్ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి షోకాజ్ నోటీసు జారీ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తoడాలో GRR విశ్రాంతి రిసార్ట్స్ `రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారి చేసి…