ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా తిరుగు లేని గుర్తింపు సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది నటీనటులకు ఆయనే స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తిప్రదాత చేతుల మీదుగా తాజాగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ జరిగింది. ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా..
Also Read:Emergency: ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన కంగనా!
హిచ్‌కాక్ సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్‌టిఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. డిసెంబర్ 18న ఫస్ట్ కాపీ విడుదల కాగా.. ఐదు రోజుల్లో పుస్తకాలు అన్నీ అమ్ముడు పోయాయి. దీంతో తాజాగా ఇప్పుడు సరికొత్త చేర్పులతో సెకండ్ ఎడిషన్ చిరంజీవి చేతులు మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ…‘ హిచ్ కాక్ సినిమాలు కొన్నిటిని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చూశాను. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం నిజంగా మంచి ఆలోచన. ఇలాంటి పుస్తకాలను పులగం చిన్నారాయణ, రవి పాడి మరిన్ని సంకల్పించాలి అని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముందుమాట రాయడంతో పాటు ఆయన కెరీర్ లో తొలిసారి ఒక పుస్తకాన్ని ప్రశంసిస్తూ పాడ్ కాస్ట్ విడుదల చేశారు. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ముందుమాట రాశారు.