Speaker Ayyanna Patrudu: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండి తీరాలి.. మసాలా లేకపోతే ఎలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: మీడియా చిట్ చాట్‌లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఎంత కీలకమో వివరించారు. సభలో ప్రతిపక్షం కచ్చితంగా ఉండాలి.. అప్పుడే చర్చలు రంజుగా సాగుతాయి. మసాలా లేని భోజనం ఎలా ఉంటుందో, ప్రతిపక్షం లేని సభ కూడా అలాగే ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని, పని చేయనప్పుడు జీతం తీసుకునే హక్కు ఎవరికీ లేదని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే, జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని, ఆ విషయంలో వాస్తవాలు ఒప్పుకోవాలని ఆయన పేర్కొన్నారు. వరుసగా 65 రోజులు సభకు హాజరుకాకపోతే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని, ఈ అంశంపై పార్లమెంట్ స్పీకర్ సలహాలు కూడా తీసుకుంటానని తెలిపారు. మరోవైపు.. జగన్ గతంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్ అనలేదా? అని ప్రశ్నించారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని, అయితే రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయనకు తగిన గౌరవం ఇస్తామని చెప్పారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
రాజశేఖర్ రెడ్డికి తనకు మధ్య ఉన్న పాత స్నేహాన్ని ఆయన నెమరువేసుకున్నారు స్పీకర్ అయ్యన్నా.. రాజశేఖర్ రెడ్డి నన్ను ‘అయ్యన్న’ అని పిలిచేవారు. పార్టీలు వేరైనా మా మధ్య గొప్ప గౌరవం ఉండేది. విశాఖలో రామానాయుడు స్టూడియో ప్రారంభోత్సవం సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నన్ను మంత్రులతో సమానంగా స్టేజ్ మీదకు పిలిచారు” అని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలు శత్రుత్వంగా మారిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!