AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Ministers Singapore Tour: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి చెందిన ఏడుగురు మంత్రుల బృందం అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మొత్తం ఏడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మంత్రుల సింగపూర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. సుపరిపాలన, ఆధునిక పరిపాలనా విధానాలు, ఉత్తమ పాలనా పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసెస్) అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్‌లో అమలవుతున్న సమర్థవంతమైన పాలనా నమూనాలను పరిశీలించి, వాటిని రాష్ట్ర అభివృద్ధికి అన్వయించుకునే దిశగా ఈ పర్యటన ఉపయోగపడనుంది.
Read Also: New Shoes Dispute: కొత్త షూస్ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన అన్న
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఈ పర్యటనలో మంత్రులు అచ్చెన్నాయుడు, పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యుకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్ పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి అక్కడి తెలుగు సంఘం ఘన స్వాగతం పలికింది. స్థానిక తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు వారిని ఆత్మీయంగా ఆహ్వానించారు.
సింగపూర్‌లో ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా సేవల నిర్వహణ వంటి అంశాలను మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది. అలాగే World Bankతో పాటు సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందిన సింగపూర్-ఏపీ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్ (SGJIWC) అవగాహన ఒప్పందం కింద శిక్షణ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ వంటి నాయకత్వ సూత్రాలపై నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (ToT) కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర పరిపాలనలో కొత్త మార్పులు, ఆధునిక విధానాల అమలు దిశగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!