YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన భయంకరమైన రంపం దాడి ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న సదరు పదో తరగతి బాలికను ఆయన సోమవారం స్వయంగా పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులతో సమీక్షించి బాలిక ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవల వివరాలను తెలుసుకున్న ఆయన, బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి, మద్యం సంస్కృతే ఈ ఉన్మాద దాడికి ప్రధాన కారణమని, పాలనపై పట్టు సాధించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా జగన్ ధ్వజమెత్తారు.
బడిలోనూ రక్షణ లేని పరిస్థితి.. ప్రభుత్వం తలదించుకోవాలి
పాఠశాల ఆవరణలోకి ఒక అపరిచిత వ్యక్తి రంపంతో వచ్చి విచక్షణారహితంగా దాడి చేస్తుంటే అడ్డుకునే నాథుడే కరువయ్యారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో గంజాయి, బెల్టు షాపులు అందుబాటులోకి రావడంతోనే చిన్నపిల్లలు, యువత దారితప్పుతున్నారని విమర్శించారు. పాఠశాలల్లో చదువుకునే ఆడపిల్లలకు కూడా రక్షణ కల్పించలేకపోతున్న ప్రభుత్వం ఈ దారుణానికి తలదించుకోవాలని మండిపడ్డారు.
Also Read
రూ.50 లక్షల సాయం చేయాలి.. కూటమి వైఫల్యాలపై జగన్ నిప్పులు
బాధిత విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని, వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని జగన్ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోతే తమ పార్టీయే బాధితురాలి వైద్యానికి తోడ్పడుతుందని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం రాగానే ఆ కుటుంబానికి రూ.50 లక్షలు అందిస్తుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబం వైఎస్సార్సీపీతో ముడిపడి ఉన్నందున, రాష్ట్రంలో నడుస్తున్న ‘రెడ్ బుక్’ కక్షసాధింపు రాజ్యాంగం వల్లే శాంతిభద్రతలు క్షీణించాయని, రాప్తాడులోనే గత 15-16 నెలల కాలంలో ఇది తొమ్మిదో ఘటన అని ఆరోపించారు. వైద్యుల శ్రమతో బాలిక కోలుకుంటోందనే వార్త కొంత ఊరటనిస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
-
Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
-
Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
-
Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
-
Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!