Minister Satya Kumar Yadav: లడ్డూ ప్రసాదం కల్తీపై మంత్రి సీరియస్‌.. క్షమించరాని నేరం.. వారిని వదిలిపెట్టం..

  • తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై మంత్రి సత్యకుమార్ ఫైర్..
  • లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలచివేసింది..
  • తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారు..
  • విచారణ తర్వాత జగన్ సహా ఎవ్వరినీ వదిలిపెట్టమని వ్యాఖ్య..
Satya Kumar Yadav

Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav: భక్తులు పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది.. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలచివేసిందన్నారు.. ఇలాంటి నేరం ఎవరూ.. ఎప్పుడూ భగవంతుడు విషయంలో పాల్పడి ఉండరని వ్యాఖ్యానించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారు.. టీటీడీని రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నారు అంటూ మండిపడ్డారు..

Read Also: BJP Morcha: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. బీజేపీ మోర్చ ఘాటు విమర్శలు..

ఇక, అన్య మతస్తుడిని టీటీడీ చైర్మన్ గా నియమించారు‌.. పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ… స్వామివారి ఆస్తులను తెగనమ్మడానికి ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి సత్యకుమార్‌.. క్షమించిరాని నేరం చేశారు.. కమీషన్ల కోసం లడ్డూ తయారీలో నాసిరకం నెయ్యి తీసుకుని వచ్చారు… ఒక కేజీ మూడు వందల రూపాయల వరకు వచ్చేలా అవినీతి చేశారు.. ఆ అవినీతి సొమ్ము జగన్ ఖాతలోకి వెళ్లాయని విరుచుకుపడ్డారు.. సమగ్ర విచారణ తర్వాత వైఎస్‌ జగన్ సహా ఇతర మాజీ చైర్మన్‌లను జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్..