Prabhas’ Fauji: ఫౌజి కోసం ఊహించని రిస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ చీలమండ వద్ద గాయం కావడంతో డాక్టర్లు సూచనలు మేరకు ఆయన షూటింగ్ కి బ్రేకులు వేశారు. గాయం కారణంగా కల్కి జపాన్ ప్రమోషన్స్ కి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఈ సినిమా జనవరి మూడో తేదీన జపాన్ లో రిలీజ్ అవబోతుంది. అయితే వచ్చే నెల మొదటి వారంలో ఫౌజి షూటింగ్ మళ్లీ మొదలు కానుంది. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పట్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఆయన మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు. ఇది స్వాతంత్రానికి ముందు జరిగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ కోసం పలు భారీ బడ్జెట్ తో కూడిన సెట్స్ నిర్మించారు.
Pushpa 2: హిందీలో తగ్గేదేలే.. మరో రికార్డుకు చేరువలో పుష్ప రాజ్
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ జైల్ సెట్ కూడా నిర్మించారు. అక్కడే ఒక కీలకమైన షెడ్యూలు కూడా జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగ్ భాగం కలకత్తాలో చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికీ కలకత్తాలో ఎన్నో పురాతన భవనాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీరియాడిక్ సినిమాకి ఆ సిటీ కరెక్టుగా సెట్ అవుతుంది. దీంతో వచ్చే సమ్మర్లో అక్కడ షూట్ చేయడం కోసం ఏ భవనాలు బాగుంటాయో హనూ రాఘవపూడి అండ్ టీం ప్రస్తుతానికి సెర్చ్ చేస్తోంది. ఒక రకంగా లైవ్ లొకేషన్స్ లో ఈ సినిమా షూట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఇలా లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. అయినా ఆయా భవనాల సెట్స్ ను సిద్ధం చేయడం కంటే భారీ సెక్యూరిటీతో అక్కడే షూట్ చేయడం బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..