Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satya Master: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని డ్యాన్సర్స్ యూనియన్‌లో ముసలం మరింత తీవ్రరూపం దాల్చింది. యూనియన్ అంతర్గత వ్యవహారాలు, ఎన్నికల రాజకీయం, కార్డుల పంపకంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కార్చిచ్చు రేపుతున్నాయి. కొందరు స్వార్థపరుల వల్ల వందలాది మంది పేద డ్యాన్సర్ల బతుకులు రోడ్డున పడుతున్నాయని ఆయన నేరుగా ఆరోపించారు. ఈ వివాదంలో సత్య మాస్టర్ లేవనెత్తిన ప్రధానాంశం ఎన్నికల అక్రమాలు. యూనియన్‌లో మద్దతు కరువవుతుందన్న భయంతో సెక్రటరీ బాలు బరితెగించారని ఆయన బాహాటంగా విమర్శించారు. “సభ్యులెవరూ తమ వెంట నిలబడకపోతే, ఏళ్ల క్రితమే రిటైర్ అయిపోయిన 200 మంది డ్యాన్సర్లకు కొత్తగా మెంబర్షిప్ కార్డులు ఇచ్చి మరీ గెలుస్తామని వాట్సాప్ గ్రూపుల్లో ఆయన మెసేజ్‌లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి” అని సత్య మాస్టర్ కుండబద్దలు కొట్టారు. అధికారం కోసం ఇలాంటి దొంగ ఓట్లను సృష్టించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
జానీ మాస్టర్ భార్య సుమలత నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సత్య మాస్టర్ వైరల్ కామెంట్స్ చేశారు. “ఓ 600 మంది బతుకుతున్న పెద్ద భవనంలో నాలుగు అవినీతి ఎలుకలు చేరాయని చెప్పి, మొత్తం బిల్డింగ్‌నే తగలబెట్టేస్తారా? ఆ నాలుగు ఎలుకల్లోనే ఓ పెద్ద అవినీతి తిమింగలం దాగుంది. నిజానికి ఆ పెద్ద ఎలుకను ముందునుంచీ చేరదీసి పెంచి పోషించిందే మీ నాయకత్వం. సుమలత గారి కార్యవర్గంలోనే ఎందరో అవినీతిపరులు తయారయ్యారు” అంటూ విమర్శలు గుప్పించారు. ఫెడరేషన్ తీరును ఎండగడుతూ సత్య మాస్టర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి ఫెడరేషన్ ముందుకు వెళ్తే, సభ్యులపైనే పోలీస్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ఫెడరేషన్ పెద్దలకు మద్దతుగా నిలిచిన వారిపై ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల్లో బూతులు తిడుతూ మెసేజ్‌లు పెడుతున్నారు. చిత్రపురి కాలనీ సమస్యలు వేరు, ఫెడరేషన్ సమస్యలు వేరు, అసోసియేషన్ సమస్యలు వేరు. కానీ చిత్రపురి వివాదాలను ఇక్కడి గ్రూపుల్లోకి లాగి డ్యాన్సర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొన్నామధ్యే తన చేతుల మీదుగా కార్డ్ తీసుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మైక్ ముందు నిజాలు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
ఆయన తన వ్యక్తిగత వైఖరిని స్పష్టం చేస్తూ.. “గతంలో జానీ మాస్టర్ భార్యకు నేనే ఓటు వేశాను, జానీ నాకు సోదరుడిలాంటి వాడు. అటు శేఖర్ మాస్టర్‌కు కూడా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న నాయకత్వం వెనుక మాత్రం నేను నడవలేను. ఇది పూర్తిగా సాధారణ డ్యాన్సర్లు, వారి పొట్టకూటి వేతనాల సమస్య. అలాంటిది సమస్యను పక్కనపెట్టి మాస్టర్లను విలన్లుగా చిత్రీకరిస్తున్నారు” అని సత్య మాస్టర్ స్పష్టం చేశారు. ఆయన చేసిన సంచలన కామెంట్స్, తన వద్ద ఉన్నాయంటున్న ఆధారాలు ఇప్పుడు డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
తాజావార్తలు
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!