Minister Satya Kumar Yadav: జీవో 85 నిబంధనలు సడలింపు..! వెంటనే విధుల్లో చేరండి..
- వెంటనే విధుల్లో చేరండి.. పీహెచ్సీ వైద్యులను కోరిన మంత్రి సత్యకుమార్ యాదవ్..
- పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో మూడో విడత చర్చలు..
- జీవో 85లోని నిబంధనలు సడలిస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: వెంటనే విధుల్లో చేరాలని పీహెచ్సీ వైద్యులను కోరారు ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్.. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లో బుధవారం పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో మూడో విడత జరిగిన చర్చలో మంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమీషనర్ సి.హరికిరణ్, డీహెచ్ డాక్టర్ పద్మావతి, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పాల్గొన్నారు. చర్చల అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అన్ని బ్రాంచ్‌లలో 20 శాతం రిజర్వేషన్ పెంచడం వల్ల 258 సీట్లు పొందే అవకాశమేర్పడుతుందన్నారు. పీజీ ఇన్ సర్వీసులో జాయిన్ కాకముందు ఏ బ్రాంచ్ లో డిప్లమా చదివితే అదే బ్రాంచ్‌లో పీజీ చేయాలన్న జీవో 85 లోని నిబంధనను సడలిస్తామని, దీంతో ఏ బ్రంచ్ లోనైనా పీజీ చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. అలాగే సర్వీసులోకి రాకముందు పీజీ చేసి ఉంటే ఇన్ సర్వీసులో రెండవ పీజీ చేసేందుకు అర్హత లేదన్న నిబంధనను కూడా సడలించి స్వంత ఖర్చులతో పీజీ చేసేలా జీవోను సవరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Shikhar Dhawan Retirement: అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికా: ధావన్
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
ఇక, ప్రభుత్వం పెద్ద మనసుతో జీవో 85ను సవరించేందుకు గత చర్చల్లో ముందుకొచ్చిందన్నారు మంత్రి సత్యకుమార్. ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్(2020 బ్యాచ్‌కు ) ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామన్నారు. పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మె విరమించి పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తక్షణమే విధుల్లోకి చేరాలని కోరారు. ఈనెల 13, 18 తేదీల్లో జరిగిన చర్చల్లో కూడా పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. సంఘం ప్రతినిధులు తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారనీ, అయితే ప్రభుత్వానికున్న పరిమితులు, ఇబ్బందుల్ని కూడా అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, చర్చల్లో ఒకటి మాట్లాడి, బయటికెళ్లాక మరొకటి మాట్లాడే విధానానికి స్వస్తి పలకాలన్నారు.
అపోహలు, అసత్యాలకు తావులేకుండా సంఘం ప్రతినిధులు వ్యవహరించాలన్నారు. గత ప్రభుత్వంలోలా కాకుండా ఈ ప్రభుత్వం అన్ని విధాలా సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్‌లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
-
Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
-
HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
-
AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..