Shikhar Dhawan Retirement: అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికా: ధావన్
- అంతర్జాతీయ క్రికెట్‌కు ధావన్ వీడ్కోలు
- దేశవాళీ క్రికెట్ ఆడాలనుకోలేదు
- ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan About Retirement: శిఖర్ ధావన్ కంటే ముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు భారత జట్టులో కొనాగుతున్నారు. ఇషాంత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి వారు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. రిటైర్డ్ భారత క్రికెటర్స్ ఎంఎస్ ధోనీ, పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఇంకా ఆడుతున్నారు. ఫిట్‌గా, మంచి ఫామ్‌లో ఉన్న ధావన్ మాత్రం.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ఎందుకు పలకాల్సి వచ్చిందో చెప్పాడు.
భారత జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్లో ఆడే ఆసక్తి లేకపోవడం వల్లే రిటైరయ్యానని శిఖర్ ధావన్ తెలిపాడు. ఓ జాతీయ మీడియాతో గబ్బర్ మాట్లాడుతూ… ‘నేను దేశవాళీ క్రికెట్ ఆడాలనుకోలేదు. అందులో ఆడాలనే ఉత్తేజం, ఆసక్తి నాలో లేదు. నా కెరీర్ చివరి రెండేళ్లలో పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో మాత్రమే ఆడాను. చివరి రెండేళ్లలో నేను క్రికెట్ ఆడింది తక్కువే. చాలా క్రికెట్ ఆడాననుకున్నా. నాకు విరామం కావాలనిపించింది. ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడంతో అంతగా ఫామ్‌లో కూడా లేను. నేను సంతోషంగా ఉన్నా. కెరీర్‌లో సాధించిన దాని పట్ల సంతృప్తి చెందా. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది’ అని అన్నాడు.
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
Also Read: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై ఇండియన్స్‌కు భారీ ప్రయోజనం!
టీమిండియా ఓపెనర్‌గా శిఖర్ ధావన్ ధనాధన్ మెరుపులు మెరిపించాడు. కెరీర్‌లో భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 17 సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లోనూ గబ్బర్ రాణించాడు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 222 మ్యాచ్‌లు ఆడి 6769 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 51 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఏడాది పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో ఆడుతున్నాడు.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!