Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ధరల తగ్గింపు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నిత్యావసర ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించిన విషయం తెలిసిందే.
ఉల్లి ధరపై కీలక నిర్ణయం
ధరల పెరుగుదలకు కొన్ని కారణాలతో పాటు స్వార్థపరుల చర్యలు, యుద్ధ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కూడా కారణమయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందుగా ఉల్లిపాయల సరఫరాపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడితో సమన్వయం చేసుకుని కిలో ఉల్లిని రూ.35కే సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
పామాయిల్ ధర తగ్గింపునకు చర్యలు
పామాయిల్ ధరలను కూడా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్కెట్ ధరతో పోలిస్తే లీటరుకు సుమారు రూ.10 తక్కువగా పామాయిల్ అందించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
350 ఔట్లెట్లలో బియ్యం సరఫరా
ప్రజలకు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 350 ఔట్లెట్లలో బియ్యం సరఫరాపై దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే బియ్యం కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బియ్యం సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కందిపప్పుపైనా త్వరలో నిర్ణయం
నిత్యావసర సరుకుల్లో కీలకమైన కందిపప్పు ధరపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అయితే, ధరల నియంత్రణ, ధరల తగ్గింపుపై నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం
నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు త్వరలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!