Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది.. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ.2,123 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ఫేజ్ -1లో రూ.2,123 కోట్లు నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కారు.. మొత్తం రహదారులు 1,299 కాగా.. వీటిలో 4 బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. మొత్తం 4,007 కిలో మీటర్లు పొడువైన రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.. మొత్తం 26 జిల్లాల్లో రోడ్ల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నారు.. 157 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగనున్నాయి.. 484 మండలాల్లోని 4,007 కిలో మీటర్ల పొడవున గ్రామీణ ప్రాంత రోడ్లను డెవలప్ చేయనుంది ప్రభుత్వం.. దీని కోసం 2,123 కోట్ల రూపాయల వ్యయాన్ని ఖర్చు చేయనుంది.. ఆ మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, గత ప్రభుత్వ హయాంలో రోడ్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు గుప్పించారు.. అయితే, ఇప్పుడు కూటమి సర్కార్ హయాంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు..
Read Also: Saudi Arabia: సౌదీలో నాన్-ముస్లింలకు ‘‘మద్యం’’.. కానీ, ఒక్క కండిషన్..