Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్‌తో మంత్రి సమావేశమై, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా పూర్తి స్థాయి ప్రమోషన్లు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించారు.
ఇక చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారంపై కూడా దృష్టి సారించారు మంత్రి పయ్యావుల.. ముఖ్యంగా 10/1999 గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించిన సీనియారిటీ వివాదాలు కోర్టుల్లో ఉండటం వల్ల ఏర్పడిన అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ సమస్యను ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సీనియారిటీ వివాదాల కారణంగా కింది స్థాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా మంత్రి ప్రస్తావించారు. పదోన్నతుల్లో వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తంగా, ఈ నిర్ణయాలు అమలు అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, పరిపాలన వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!