Farooq Abdullah: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీయుడు కాబట్టి, మొత్తం బంగ్లాదేశ్‌ని నిందించలేమని బుధవారం అన్నారు. అమెరికాలో కూడా అక్రమ భారతీయులు ఉన్నారని, జీవనోపాధి కోసం ఎవరైనా ఎదైనా చేయొచ్చని ఆయన చెప్పారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశ్‌కి చెందిన మహ్మద్ షరీఫుల్‌గా తేలిన తర్వాత ఫరూఖ్ అబ్దుల్లా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: Made In India Car: ఈ మేడ్-ఇన్-ఇండియా కారు.. 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి..
ఒక దాడిని మొత్తం దేశానికి ఆపాదించలేమని అబ్దుల్లా అన్నారు. భారతీయులు ఇతర దేశాలకు వలసలు వెళ్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఒక జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీయుడైతే మొత్తం ఆ దేశాన్ని నిందించలేమని, యూఎస్ లేదా కెనడాలో ఒక భారతీయుడు తప్పు చేస్తే, దానికి భారతదేశాన్ని నిందించవచ్చా..? అని ప్రశ్నించారు. యూఎస్‌లో కూడా అక్రమ భారతీయులు ఉన్నారని, జీవనోపాధి కోసం ఎవరైనా ఏమైనా చేయొచ్చని, భారతీయులు కూడా అక్రమంగా అమెరికాలోకి వెళ్తున్నారని చెప్పారు.
బాలీవుడ్ స్టార్ బాంద్రాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున కత్తిపోట్లకు గురయ్యాడు. దొంగతనం కోసం ఇంట్లోకి ప్రవేశించిన షరీఫుల్ ఇస్లాం సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆయనకు వెన్నెముక, మెడపై తీవ్రగాయాలయ్యాయి. వెన్నెముకలో గుచ్చుకున్న కత్తిని శస్త్రచికిత్స చేసి వైద్యలు బయటకు తీశారు. నిందితుడిని 70 గంటల తర్వాత థానేలో పట్టుకున్నారు. ముంబై కోర్టు అతడికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.