అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని మంత్రుల కమిటీ సమావేశం పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి నారా లోకేష్ చాంబర్ లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు టీజీ భరత్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి హాజరై.. అధికారులకు దిశానిర్దేశం చేశారు.