AP Collectors Conference: నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Collectors Conference: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, శాంతిభద్రతలు సహా అనేక అంశాలపై ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కలెక్టర్ల సదస్సుకు సిద్ధమయ్యారు.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా సమీక్షించనున్నారు. మొత్తం 19 కీలక అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు.
తొలిరోజు కీలక అంశాలపై సమీక్ష
సదస్సు తొలిరోజు గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, జిల్లా వారీ అభివృద్ధి లక్ష్యాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జీఎస్డీపీ వృద్ధి, స్వర్ణ ఆంధ్ర–2047 జిల్లా రోడ్‌మ్యాప్‌లు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. రాష్ట్రాన్ని దీర్ఘకాలికంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు సూచనలు ఇవ్వనున్నారు. సూపర్ సిక్స్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కూడా సమీక్ష ఉంటుంది. ఆరోగ్యం, విద్యాశాఖల పనితీరుతో పాటు జిల్లాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, వాటి ఫలితాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడం, జిల్లాల ఆర్థికాభివృద్ధికి అవకాశాలను వినియోగించుకోవడంపైనా సమీక్ష జరగనుంది.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక దృష్టి
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావంపై కూడా ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రజలకు తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం పురోగతిపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో వివిధ జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ఉత్తమ ఆవిష్కరణలు, వినూత్న కార్యక్రమాలకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి గురించి వివరించనున్నారు.
రెండో రోజ ఈ అంశాలపై ఫోకస్..
సదస్సు రెండో రోజు ఈ-గవర్నెన్స్, RTGS, PGRS పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. భూ పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగం, వాటి అమలు తీరుపై చర్చిస్తారు. జిల్లాల స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్లతో ఓపెన్ ఫోరం నిర్వహించనున్నారు. రెండో రోజు చివరగా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష జరగనుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు ప్రసంగం చేస్తారు. రెండు రోజుల సదస్సులో చర్చించిన అంశాల ఆధారంగా జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సేవల మెరుగుదలకు కలెక్టర్లకు కీలక మార్గదర్శకాలు ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!