Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Karuppasamy: తెలుగు సినిమా కథల బలం, మేకింగ్ స్థాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా దర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా తమిళంలో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ‘మోధ రాత్రి’ చిత్ర దర్శకుడు రాజా కరుప్పసామి తెలుగు సినిమా ప్రతిభపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయను ఇండియాలోనే టాప్ టాలెంట్లలో ఒకరిగా అభివర్ణించిన ఆయన, 2022లో వచ్చిన ‘అంటే సుందరానికీ!’ చిత్రాన్ని అండర్రేటెడ్ మాస్టర్‌పీస్‌గా వర్ణించారు. ఆ సినిమాలోని స్క్రీన్‌ప్లే, కథనం అత్యద్భుతమని కొనియాడారు.
కొత్త ముఖాలు రిషికాంత్, అనిష్మా అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రామీణ కామెడీ – ఎమోషనల్ మూవీ ‘మోధ రాత్రి’. ఆగస్టు 21న థియేటర్లలో రిలీజ్ అయ్యి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టి, గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ విభాగంలో టాప్-10లోకి దూసుకెళ్లడమే కాకుండా ఏకంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ప్రపంచ స్థాయిలో దక్కిన ఈ మైలురాయిపై ప్రముఖ హీరో కార్తి సైతం చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ భారీ విజయాన్ని తన సినీ ప్రయాణంలో ఒక ‘మాగ్నమ్ ఓపస్ క్లైమాక్స్’గా పేర్కొన్న డైరెక్టర్ రాజా కరుప్పసామి, చిన్నప్పటి నుంచే తనకు తెలుగు సినిమాలంటే విపరీతమైన ఇష్టమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ ‘అంజి’ లాంటి చిత్రాలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని గుర్తుచేసుకున్నారు. ఒక తమిళ దర్శకుడు పక్క ఇండస్ట్రీలోని కంటెంట్‌ను, ముఖ్యంగా వివేక్ ఆత్రేయ వంటి విలక్షణ దర్శకుడి కథన శైలిని ఇంతలా ప్రశంసించడం ఇరు పరిశ్రమల అభిమానుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!