CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు..!
- రాష్ట్రంలో పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు..
- బీపీసీఎల్.. విన్ ఫాస్ట్ కంపెనీ ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ..
- ఏపీలో ఆయిల్ రిఫైనరీ.. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్‌తో చర్చలు..
- కార్యరూపం దాల్చితే రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం..
- ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో ప్రముఖ కంపెనీగా ఉన్న విన్ ఫాస్ట్..
- ఈవీ.. బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని కోరిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వివిధ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడుల ఆహ్వానిస్తున్నారు.. ఇక, ఈరోజు సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్, విన్ ఫాస్ట్ కంపెనీ ప్రతినిధులు వేర్వేరుగా భేటీ అయ్యారు.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.. ఏపీలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో ఏపీ సీఎం చర్చలు జరిపారు.. ఆయిల్ రిఫైనరి కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు సీఎం చంద్రబాబు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4, 5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని సీఎంకు వివరించారు కంపెనీ ప్రతినిధులు.. అవసరమైన భూములు కేటాయిస్తామని.. 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు చంద్రబాబు. ఇక, అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామని సీఎంతో చెప్పారు బీపీసీఎల్ ప్రతినిధులు.
Read Also: Mythri Movie Makers: తెలుగులో ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
మరోవైపు.. విన్ ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం జరిగింది.. విన్ ఫాస్ట్.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో ప్రముఖ కంపెనీగా ఉంది.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆ కంపెనీ ప్రతినిధులకు వివరించారు సీఎం చంద్రబాబు.. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని కోరారు.. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఈ సందర్భంగా విప్ ఫాస్ట్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
https://x.com/AndhraPradeshCM/status/1811021087419027506
https://x.com/AndhraPradeshCM/status/1811020677669081219
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!