మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫార్మేషన్ GFST ఆధ్వర్యంలో "డీప్ టెక్ సమ్మిట్-2024"కు వేదికైంది. ఇక, ఈ కీలక సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సదస్సులోనే వచ్చే ఐదేళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం వుంది.
వరద బాధితులకు చిన్నారి విద్యార్థుల విరాళంపై సీఎం నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాకెట్ మనీని వరద సాయంగా ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోత్సవం చేయనున్నారు సీసీఎల్‌ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు.