ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. తొలిరోజు బిజీబిజీగా గడిపిన ఆయన.. ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు..