Pawan Vs Bonda Uma: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దీంతో ఏపీలోని ఎన్డీయే కూటమిలో అంతర్గత వివాదాలు కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే బోండా ఉమ వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య డిబేట్ హాట్ హాట్ గా కొనసాగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ టార్గెట్ గా బోండా ఉమా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సాక్షిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంశానికి సంబంధించి.. చైర్మన్ పని తీరుపై నిన్న బొండా ఉమ.. క్వశ్చన్ అవర్ లో అనుబంధ ప్రశ్నను సంధించారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్పందించడం లేదని ఉమ పేర్కొన్నారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం అందుబాటులో ఉండడం లేదని చైర్మన్ చెప్పారని ఆయన తెలిపారు.
Read Also: Uttarpradesh: దుర్గామాతపై అభ్యంతరకర పాట.. భగ్గు మంటున్నహిందూ సంఘాలు..
కాగా, ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. తాజా పరిణామాలపై ప్రస్తుతం మాట్లాడేందుకు బోండా ఉమా నిరాకరించారు. చెప్పాల్సింది మొత్తం అసెంబ్లీలోనే చెప్పనన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ ఈ వివాదానికి స్పందిస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, బోండా ఉమాకు అధికారులు అదే సమాధానం చెప్పారా?.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏం జరుగుతుంది?.. ప్రతిపక్షమే లేని సభలో ఎందుకు అగ్గి రాజుకుంది?.. పి. కృష్ణయ్యను పవన్ వెనకేసుకొచ్చారా?.. కూటమిపై దీని ప్రభావం ఎంత..? ఈ అంశాలపై కూడా రాజకీయంగా చర్చ కొనసాగుతోంది.