Ambati Rambabu: సీఎం వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఎటాక్.. దీనికి బాధ్యుడు చంద్రబాబే..!
- సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్..
- పోలవరం పర్యటనలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి..
- 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, అనేక అబద్దాలు చెబుతున్నారు..
- అసలు పోలవరాన్ని ప్రారంభించింది కట్టాలనుకున్నది వైఎస్సార్....
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు విషయంలో మరోసారి కూటమి సర్కార్.. వైసీపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో.. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. పోలవరం పర్యటన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అనేక అబద్దాలు చెబుతున్నారు.. అసలు పోలవరాన్ని ప్రారంభించింది కట్టాలనుకున్నది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని.. కానీ, పోలవరాన్ని తానే కడుతున్నట్లుగా చంద్రబాబు కథలు చెబుతున్నారు.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని, బతిమిలాడి మేం కడతామని చెప్పి తీసుకున్నారు… ఇది చారిత్రాత్మక తప్పిదం అంటూ ఫైర్ అయ్యారు..
Read Also: Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..
Also Read
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
స్పిల్ వే గేట్లు కూడా అమర్చామని అబద్ధం చెపుతున్నారు.. ఈ అబద్ధాలు వింటే ప్రజలు నవ్విపోతారు.. స్పిల్ వే పూర్తి చేసింది వైసీపీ, స్పిల్ వే గేట్లు పెట్టింది వైసీపీ.. ఒక రేకు తీసుకువచ్చి అక్కడ పెడితే, స్పిల్ వే గేట్లు అమర్చినట్లు కాదు అని హితవు చెప్పారు అంబటి రాంబాబు.. వైసీపీ చేసిన పనిని, మీరు చేసినట్లుగా చెబుతున్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వచ్చింది.. 2014 – 19 మధ్య పోలవరం కట్టడంలో తప్పులు జరిగాయని, అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిందన్నారు. అసలు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలేంటి..? కాపర్ డ్యామ్‌లు కట్టకుండా, డయాఫ్రంవాల్ కట్టడం చారిత్రాత్మక తప్పిదం అన్నారు. మీరు చేసిన తప్పిదం వల్లే మళ్లీ 900 కోట్లతో డయాఫ్రం వాల్ కట్టాల్సి వస్తుంది.. దీనికి బాధ్యుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.. అయితే, పచ్చి అబద్ధాలు ఆడే ప్రయత్నం చంద్రబాబు చేశారని దుయ్యబట్టారు.. టీడీపీ, చంద్రబాబు అసమర్థత, అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందన్న ఆయన.. నదిని డైవర్ట్ చేయకుండా ఏ దేశంలో నైనా ప్రాజెక్టులు కడతారా..? అని నిలదీశారు.. వేరే దేశాల్లో అయితే ఇలాంటి తప్పులకు ఉరి శిక్షలు వేస్తారు అని హెచ్చరించారు అంబటి రాంబాబు.
Read Also: Magical Stumping: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ఘటన.. మీరే చూసేయండి (వీడియో)
గతంలో పోలవరంలో అవినీతి జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీయే చెప్పారని వ్యాఖ్యానించారు అంబటి.. పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నారని చంద్రబాబుపై మోడీ ఆరోపించారు… పోలవరానికి నిధులు తెస్తుంటే, పొత్తుల పేరుతో వచ్చే నిధులుకు అడ్డం పడ్డారు.. కరోనా నేపథ్యంలో మూడు సంవత్సరాలు కూలీలు దొరకకపోయినా, ప్రత్యామ్నాయ మార్గాలలో, నదిని డైవర్ట్ చేసి ,స్పిల్ వే పూర్తి చేసిన ఘనత వైసీపీదే అన్నారు. చంద్రబాబు పోలవరాన్ని 2027కి పూర్తి చేస్తామని చెప్తున్నారు.. 2018 పూర్తి చేస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయి..? అని ఫైర్ అయ్యారు.. కేంద్రం మొదటి దశకు 12 వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది.. ఆ నిధుల విడుదల వెనక ఓ కుట్ర ఉంది.. 41.15 కు మాత్రమే ఈ ప్రాజెక్టును పరిమితం చేయడానికి చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు.. రెండవ దశ నిర్మాణాలు ఉండవు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎగ్గొట్టడానికి జరుగుతున్న కుట్ర ఇది అంటూ సంచలన ఆరోపణల చేశారు.. నిమ్మల రామానాయుడు పచ్చ చొక్కా వేసుకొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.. చంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే, నిమ్మల రామానాయుడు, 102 అబద్ధాలు ఆడుతున్నాడు.. ఇలాంటి అబద్ధాలు ఆడితే ప్రయోజనం లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!